ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాధితుల కోసమంటూ ఫీల్డ్ లోకి వచ్చి షో చేయడంలో జగన్ రెడ్డి ప్రత్యేకమైన స్క్రిప్టును ఫాలో అయ్యేవారు. పొలాల్లోకి దిగేవారు. బురదలో నిలబడి మీడియాతో మాట్లాడేవారు. అప్పట్లో ఆయన స్కిట్స్ చూసి ఇంత డెడికేషనా అని చాలా మంది ఆశ్చర్యపోయేవారు. సీఎం అయిన తర్వాత ఏం చేశాడన్నది పక్కన పెడితే ఇప్పుడు షర్మిల అంతకు మించి.. అన్నకు మించి అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు.
వర్షాల కారణంగా పంట నష్టం జరిగిందని పరిశీలించి.. రైతులకు భరోసా ఇస్తానని తాడేపల్లి గూడెం వెళ్లారు. అక్కడ పొలాల్లో నిలబడిపోయిన నీళ్లలోకి దిగిపోయారు. అవి నడుం వరకూ ఉన్నాయి. పొలాల్లో అంతెత్తు నీళ్లు ఎలా ఉన్నాయా అని ఆలోచన చేయలేదు. కనీ మంచి స్కిట్ అవుతుందని వెంటనే దిగిపోయారు. పాపం రైతులకు చాలా కష్టం వచ్చిందని బాధపడ్డారు. రైతులకు తక్షణం సాయం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ చేసినట్లుగా రుణమాఫీ చేయాలన్నారు.
Also read : జగన్ రాజకీయ అజ్ఞాని..షర్మిల అలా తేల్చేస్తున్నారా?
షర్మిల ఏం డిమాండ్ చేసిందన్న విషయం పక్కన పెడితే ఢిల్లీలో జగన్ చేస్తున్న ధర్నా కన్నా తాను నీళ్లున్న పొలంలోకి దిగడం ద్వారానా ఎక్కువ ప్రచారం తెచ్చుకున్నారు. ఈ విషయంలో జగన్ రెడ్డి కన్నా షర్మిల రెండాకులు ఎక్కువే చదివారని.. కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. అయితే ఢిల్లీలో ఇండియా కూటమి నేతలంతా జగన్ దగ్గరకు పోలోమని పోవడం.. షర్మిలకు నిజంగా గట్టి షాకే.