హైదరాబాద్‌లో కిలారు రాజేష్‌పై రెక్కీ చేసింది ఏపీకి చెందిన “వైసీపీ పోలీసులు” అనే దానికి ఆధారాలు లభిస్తున్నాయి. తప్పుడు నెంబర్ ప్లేట్ తో రాజేష్ పై రెక్కీ నిర్వహించిన వ్యక్తిని ఏపీలో కౌంటర్ ఇంటలిజెన్స్ లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ గా భావిస్తున్నారు. కౌంటర్ ఇంటలిజెన్స్ పూర్తిగా ఉగ్రవాద నిరోధక విభాగం. అందు కోసమే పని చేయాలి. కానీ రాజకీయ నేతలపై నిఘా కోసం ఆ విభాగాన్ని వాడుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు అసాంఘిక శక్తులుగా మారి .. రెక్కీ నిర్వహించడం.. సంచలనంగా మారుతోంది. కిలారు రాజేష్ ను గురి పెట్టి భారీ కుట్ర చేస్తున్నారని ఇందులో పోలీసులు భాగం అవుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును హైదరాబాద్ పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు. రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన తిరిగిన చోట్ల సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి ఎంత ఆయనను వెంబడించారో.. ఆ వాహనాల నెంబర్లేవో బయటకు తీస్తున్నారు.
కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులతో పాటు మరో రెండు కార్లలో కిలారు రాజేష్ ను వెంటాడారు. వారు పోలీసులా లేకపోతే… వైసీపీకి చెందిన అసాంఘిక శక్తులా అన్నది తేలాల్సి ఉంది. పోలీసుల ద్వారా రాజేష్ కుటుంబానికి హాని కలిగించే కుట్రను పెద్ద ఎత్తున చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ పోలీసుల వ్యవహరశైలి పూర్తిగా దారి తప్పింది. రాజకీయ కుట్రలకే కాదు… భౌతిక దాడులకు.. రాజకీయ ప్రత్యర్థుల హత్యలకూ వారు పావుగా మారుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత ఎక్కువగా బలపడుతున్నాయి.