జగన్ రెడ్డి తనకు పేపర్లు, టీవీలు లేవంటారు కానీ ఆయన సతీమణి భారతి రెడ్డికి ఉన్నాయి. సాక్షి పత్రిక, టీవీలను ఆమే నడుపుతారు. ఆ పత్రిక , టీవీల్లో వచ్చేదంతా వైసీపీ వార్తలే. అయితే వైసీపీని, జగన్ ను ఆకాశానికెత్తడం లేకపోతే ఇతర పార్టీల నేతల మీద బూతులందుకోవడం. అంటే.. పేపర్ మొత్తం.. వైసీపీ ప్రకటనలే.. వార్తల రూపంలో వస్తాయి. కానీ ఇప్పుడు విచిత్రంగా వైసీపీ పేరుతో ఓ అధికారిక ప్రకటన వచ్చింది. మొదటి పేజీలో ఫుల్ పేజీ యాడ్ ను.. వైసీపీ ఇచ్చింది.
చంద్రబాబు ప్రభుత్వం ఒకటో తేదీన పెన్షన్లను పంపిణీ చేసింది. ఆ సమయంలో ప్రభుత్వం అబద్దం చెప్పిందంటూ… ఇవీ నిజాలంటూ.. తాము చెప్పేవి ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేసింది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ప్రకటనలు కూడా అలా లేవు. కానీ ఎవరో సోషల్ మీడియాలో విమర్శలు చేశారనో.. మరో కారణమో తీసుకుని ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే … పుల్ పేజీ ప్రకటన కన్నా ఓ న్యూస్ ఐటమ్ పవర్ ఫుల్. సాక్షితరపున వార్త రాసి ఫ్రంట్ పేజీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పటచి వరకూ అదే చేశారు. మరి ఇప్పుడెందుకు ప్రకటనలు ఇస్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది.
అయితే అసలు స్కెచ్ ఇక్కడే ఉందని సాక్షి ఇన్ సైడ్ లో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వం లో జగన్ రెడ్డి ప్రజల సొమ్మును సాక్షికి ధారబోశారు. నెలకు పది కోట్లు చందాల రూపంలో… వంద కోట్లకుపైగా ప్రకటనల రూపంలో సాక్షికి వెళ్లేవి. ఇందులో పార్టీ నేతలు ఇచ్చే ప్రకటనలు ఉంటాయి. అయితే ఇవి గత నెల మొత్తం ఆగిపోయాయి. అంటే.. మొత్తం ఆదాయం పడిపోయిది. మామూలుగా వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఇప్పుడు తమకు ప్రకటనల ఆదాయం వస్తుందని చెప్పుకోవడానికి అయినా ఇలా వైసీపీ పార్టీ ఫండ్ ను సాక్షి పత్రికకు మళ్లిస్తున్నారని అంటున్నారు. ముందు ముందు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున సాక్షికి ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు