వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేసి మరీ ప్రకటించిన రెండు జాబితాలు చూసిన వారికి వీళ్లా అభ్యర్థులు అన్న డౌట్ వస్తోంది. చివరికి బీఫాంలు మార్చేస్తారా నిజంగానే వీరికే టిక్కెట్లు ఇచ్చేస్తారా అన్న డౌట్ రెండు పార్టీల నేతలకూ వస్తోంది. వైసీపీ నేతల్లో.. వీరు అభ్యర్థులు అయితే కష్టమేమో అనుకుంటూంటే… దమ్ముంటే వీరికే బీఫాంలు ఇవ్వాలని టీడీపీ నేతల సవాల్ చేస్తున్నారు.
వారుసలకు చాన్స్
వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి నేతలు.. అల్టిమేటం జారీ చేసిన నేతల వారసులకు చాన్స్ ఇచ్చారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుమారుడికి… తిరుపతి నుంచి కురణాకర్ రెడ్డి కుమారుడికి సీటిచ్చారు. మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడికి చాన్సిచ్చారు. రామచంద్రాపురం నుంచి పార్టీ మారిపోతానని అల్టిమేటం ఇచ్చిన పిల్లి బోస్ కుమారుడికి టిక్కెట్ ఇచ్చారు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే కూతురికే చాన్సిచ్చారు. వచ్చే జాబితాల్లో మరికొంత మంది వారసులకు చాన్సివ్వనున్నారు.
గెలవరనే మార్పులు
ఇప్పుడు ఉన్న గెలవరనే మారుస్తున్నామని మంత్రి బొత్స చెబుతున్నారు. కసరత్తులో ఆయన పాత్ర ఏమీ ఉండదు కానీ.. ప్రకటన మాత్రం ఆయనతో చేయిస్తున్నారు. వారంతా తమ నియోజకవర్గాల్లో గెలవకపోతే.. ఇతర చోట్లా ఎలా గెలుస్తారో వారికే తెలియాలి. కొత్త నియోజకవర్గాల్లో జనం… పాత చోట ఇన్ని కథలు నడిపారు.. ఇక్కడ ఏం చేస్తారోనన్న చర్చ జరుగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు చిలుకలూరిపేటలో రజనీ ఏం చేశారో.. అక్కడ్నుంచి ఎందుకు మార్చారో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ జాబితాలోనూ అలాంటి మార్పులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యేను… పాయకరావుపేటకు మార్చారు. ఈ మార్పులు చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
వీరే అభ్యర్థులైతే చాలనుకుంటున్న టీడీపీ
చివరి క్షణంలో కూడా వీరిలో కొనసాగించాలని… మార్చకూడదని టీడీపీ అనుకుంటోంది. రిజర్వ్ నియోజకవర్గాల్లో టిక్కెట్లు దక్కించుకుంటున్న వారిలో కొంత మంది పూర్తిగా రెడ్డి నేతల అనుచరులు. వారెవరికీ తెలియదు. కొంత మందిప ైతీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఈ అభ్యర్థుల జాబితాలు జోష్ నింపుతున్నాయి.