వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై భారీ కసరత్తు కొనసాగుతుంది. టిక్కెట్ ఇవ్వలేని వాళ్లకు సంకేతాలు పంపుతున్నారు. మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. వారిలో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. వ్యూహాత్మకంగా విడతల వారీగదా ఎవరెవరికి టిక్కెట్లు రావో..లేవో ప్రచారం చేయిస్తున్నారు. మంగళవారం తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురి వైసీపీ సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చుని ప్రచారం చేయించారు.
టిక్కెట్ డౌట్ ఉన్న వారంతా క్యాంప్ ఆఫీసుకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీసుకు 30-35 మంది ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. వీరందరికీ జగన్ ను కలిసే అవకాశం లభించడం లేదు. జగన్ ను కలవాలంటే ముందు సజ్జలను దాటాలి. ఆయనే మొత్తం కౌన్సెలింగ్ చేసి వెనక్కి పంపేస్ున్నారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు. మంగళవారం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, పిఠాపురం, పత్తిపాడు, జగ్గం పేట, పి.గన్నవరం, రామచంద్రాపురం నేతలు న్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ కష్టమని చెప్పేందుకు పిలిచినట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణాలో విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరుగుతోంది.
అయితే ఇదంతా ఉత్తుత్తి ప్రక్రియనేనని… డబ్బులు పెట్టే సామర్థ్యం ఉన్న వారు ముందుకు వచ్చిన చోట మాత్రమే మార్పులు ఉంటాయని.. మిగతా చోట్ల మార్పులు ఉండవని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. పార్టీ ఫండ్ కోసమే మిగతా వారికి టిక్కెట్ల టెన్షన్ పుట్టిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.