పిల్లలతో ఎవరూ రాజకీయం చేయరు. ముఖ్యంగా పసి పిల్లలతో. కానీ వైసీపీ కి అదేం ఉండదు. వారి నీతి.. నిజాయితీ అనేదే ఉండదు. దానికి తాజా సాక్ష్యం… దేవాన్ష్ పై కూడా పడి ఫేక్ న్యూస్ తో ఏడవడం. దేవాన్ష్కు ఆరుగురు గన్మెన్లు అంటూ అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. దేవాన్ష్ కు సెక్యూరిటీ ఇస్తున్నట్లుగా ఆయన ఫోటోలు బయట పెట్టలేదు.. వీడియోలు బ యట పెట్టలేదు. కానీ దేవాన్ష్ పేరును బయటకు తెచ్చి ఫేక్ ప్రచారం చేశారు.
Read Also : వైసీపీకీ పులకేశీనే !
దీనిపై పోలీసులు స్పందించారు. ఎం సెక్యూరిటీ కోసం జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన ఎస్ఎస్జీ చట్టంలో ఏముందో చెబుతూ ట్వీట్ చేశారు. అంతే కాదు.. అర్హత ఉన్నప్పటికీ చంద్రబాబు కుటుంబసభ్యులు ఎవరూ సెక్యూరిటీ తీసుకోవడం లేదని.. దేవాన్ష్ కు అసలు సెక్యూరిటీ పెట్టలేదని స్పష్టం చేశారు. అసలు సీఎంకు సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా ఎస్ఎస్జీ పేరుతో ఓ గ్రూపు తెచ్చుకుని.. విదేశాల్లో ఉన్న తన పిల్లలకు కూడా కోట్ల ఖర్చుతో గార్డుల్ని పెట్టుకున్నది జగన్. ఇప్పుడా చట్టం అమల్లో ఉంది. వారు సీఎంకు సెక్యూరిటీ ఇస్తున్నారు. అయితే అలా ఇవ్వడం తప్పన్నట్లుగా అంబటి రాంబాబు మాట్లాడటం అంటే ఆ చట్టం తెచ్చిన జగన్ ను తప్పు పడుతున్నట్లే కదా అన్న డౌట్ ఆయనకు ఎందుకు రాలేదో మరి !
కానీ అంబటి దేవాన్ష్ సెక్యూరిటీ ప్రస్తావన తీసుకు రావడం వెనుక ఏదో గూడు పుఠాణి ఉందని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దేవాన్ష్ కు సెక్యూరిటీ ఇస్తున్నారో లేదో తెలుసుకోవడానికి .. ఆ పిల్లవాడికి ఎలాంటి సెక్యూరిటీ లేదన్న అంశాన్ని బయట ప్రపంచానికి తెలియడానికి ఇలా అడ్డగోలు ఆరోపణలు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతల మనస్థత్వం తెలిసిన వారు.. ఖచ్చితంగా రాంబాబు విమర్శల వెనుక అతి పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తున్నారు.