ఏపీలో అన్న క్యాంటీన్లపై విమర్శలు చేసేందుకు వైసీపీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఆహారంలో క్వాలిటీ లేదని… మరొకటని ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఓ బురద చల్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. లోకేష్ అర ఇడ్లీనే తిన్నారని.. చట్నీ సరిగ్గా నాకలేదని .. ఇలాంటి కారణాలతో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఎబ్బెట్టుగా మారుతోంది.
అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసేది లోకల్ వ్యక్తులు కాదు. హరే కృష్ణ మూమెంట్‌కు అప్పగించారు. ఈ సంస్థ ఇప్పటికే అక్షయపాత్ర పేరుతో బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. ఈ సంస్థకు భారీ కిచెన్‌ను ఏర్పాటు చేసింది. ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం, కూరలు వండే విధానం ఉంటుంది. ప్యాకింగ్ కూడా పత్యేకంగా ఉంటుంది. అన్న క్యాంటీన్లపై నిందలు వేయడానికి ఇలాంటి సంస్థలను తప్పు పడుతున్నారు వైసీపీ నేతలు.
అన్న క్యాంటీన్లు అన్నార్తుల కడుపు నింపేవి. తమ దగ్గర డబ్బులు ఉంటే.. తినగలిగే పరిస్థితుల్లో ఉన్న ఎవరూ అన్న క్యాంటీన్లకు రారు. కొనుగోలు చేసి తినలేని వారే వస్తారు. అలాంటి వారి కడుపు నింపడం పుణ్యం. ఆ అన్నంపై నిందలేయడం మహా పాపం. రాజకీయాల కోసం వైసీపీ ఇలాంటి మహా పాపాలను ఎన్ని చేయడానికైనా వెనుకాడటం లేదు.