చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఆయనకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ లేనంత అసాధారణ స్వాగత సత్కారాలు చేయడమే కాదు.. కీలకమైన కార్యక్రమాల్లో వైసీపీ నేతల హడావుడి అంతర్గతంగా కనిపించింది. ఈ మతలబేమిటో చాలా మందికి అర్థం కాలేదు. కానీ మెల్లగా అందరికీ తెలుస్తోందేమిటంటే… టీటీటీని.. శ్రీవారిని ఉపయోగించుకుని సీజేఐని కాకా పట్టేందుకు వైసీపీ నేతలు పూర్తిగా దిగజారిపోయారని.
సీజేఐ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైన తర్వాత టీటీడీలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి మూడు సార్లు ప్రత్యేకంగా సీజేఐని కలిశారు. కేవలం భక్తి పూర్వకమైన అంశాలపై మాట్లాడటానికే ఆయన వెళ్లారు. అలాగే మాట్లాడారు కూడా. ఆ భక్తి పూర్వక అంశాలేమిటంటే సీజేఐ ఆంధ్ర పర్యటనలో టీటీడీ పండితులతో కలిసి వేదాశ్వీరచనం ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఒప్పుకోవాలిని ఒత్తిడి చేశారు. చివరికి సీజేఐ అంగీకరించారు. ఆ కార్యక్రమం జరిగిన పొన్నవరం వేదికపై వైసీపీ నేతంలదంరూ ప్రత్యక్షమయ్యారు. ప్రోటోకాల్ పేరుతో మంత్రి పెద్దిరెడ్డి .. సీజేఐ రమణకు సరిహద్దుల్లోనే స్వాగతం చెప్పగా… ఇక స్వగ్రామంలో అయితే వైసీపీ నతేల హడావుడి ఎక్కువగా ఉంది . ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తాన్ని దగ్గరుండి చూసుకున్నారు.
ఇంతగా టీటీటీ అధికారులు.. సిబ్బంది.. వైసీపీ నేతలు మర్యాలు చేశారు …కానీ అదే సీజేఐ … బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా తిరుమలకు వచ్చినప్పుడు ఎలాంటి స్వాగత సత్కారాలు లభించాయి అని రివైండ్ చేస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఆయనకు స్వాగతం చెప్పడానికి ప్రభుత్వం తరపున మంత్రులు కూడా రాలేదు. సాదాసీదాగా ఆయన పర్యటన ముగిసిపోయింది. అదే తిరుమల నుంచి ఆయన హైదరాబాద్‌కు వెళ్లిన వెంటనే అక్కడ జరిగిన కార్యక్రమాలు వేరు.
సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తిరుమలకు వస్తేనే పట్టించుకోని వారు ఇప్పుడు ఆయన స్వగ్రామంలో పర్యటించడానికి మూడు రోజులు వస్తున్నారని తెలిసి… హంగామా చేశారు. ఆ టీటీటీని.. శ్రీవారిని ఉపయోగించుకుని వేదాశ్వీరచనం పేరుతో ఆయనను కాకా పట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ పెద్దల తీరు చూసి ఇప్పటికే చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు చూసి.. అసలు విలువలు.. నియమాలు ఏమీ ఉండవా అని మరింతగా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది.