టీవీ9 మీడియా ముసుగు నుంచి బ యటకు వచ్చేసింది. వైసీపీతో జాయింట్ వెంచర్ కేసులు ప్రారంభించింది. వైసీపీ పొలిటికల్ గా టార్గెట్ పెట్టుకున్న నేతలపై కేసులు పెట్టేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. మహాసేన రాజేష్ పై టీవీ 9 వారి ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో సారాంశం.. తమ సంస్ధ ప్రతిష్ట , వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వీడియోలు చేశారనే. ఫిర్యాదుదారుల్లో దేవీ నాగవల్లీ కూడా ఉన్నారు.
ఆ పెట్టే కేసులేదో తమ హెడ్ క్వార్టర్ ఉన్న హైదరాబాద్ లో పెట్టుకోవాలి మరి తాడేపల్లిలో ఎందుకు ? తాడేపల్లి పోలీసులకే టీవీ9 వాళ్లు ఎందుకు ఫిర్యాదు చేశారు ? ఇక్కడే టీవీ9-వైసీపీ జాయింట్ వెంచర్ అమలవుతోంది. మేము ఫిర్యాదు చేస్తాం.. మీరు అరెస్టు చేయండి అనే ఒప్పందంలో ఇవి జరుగుతున్నాయన్నమాట. మహాసేన రాజేష్ పై కేసులు నమోదు చేసిన విషయం గుట్టుగానే ఉంచారు. ఏ అర్థరాత్రో ఆయనను అరెస్టు చేయడానికి ప్లానన్నమాట.
రాజేష్ పై కేసులు పెట్టిన ఫిర్యాదును చూస్తే… టీవీ9లో ఒక్కరు కూడా బయట ఉండకుండా అరెస్టు చేయగలిగినంత రికార్డు ఆ టీవీ చానల్ కు ఉంటుంది. కాకపోతే చట్టాన్ని వారికి అన్వయించే ప్రభుత్వం రావాల్సి ఉంటుంది. మీడియా ముసుగులో నేరుగా విపక్షాలపై తప్పుడు ప్రచారం.. వైసీపీకి మేలు చేసే ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ..నేరుగా ఫిర్యాదులు.. కేసుల వరకూ వస్తే.. అవే తర్వాత వారి వరకూ వస్తాయి. అప్పుడు మీడియాపై దాడి అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అదే ఫిర్యాదులతో కేసులు పెట్టించింది కళ్ల ముందే ఉంటుంది కదా.