చంద్రబాబును కాల్చి చంపినా తప్పు లేదని.. జగన్ అంటారు. ఏదైనా బావి చూసుకుని దూకి చచ్చిపోమని… తిట్టిపోస్తారు. ఆయన బాటలో .. కొడాలి నాని లాంటి వాళ్లు… పార్టీ అధినేతను మెప్పించడానికి చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి.. “త్వరలోనే పోతాడు” అని ప్రసంగించేసి.. అందర్నీ సంతోషపరుస్తాడు. విజయసాయిరెడ్డి లాంటి చదవేస్తే ఉన్న మతి పోయిందని సామెతను నిరూపించే పెద్దలు… చంద్రబాబు శవం గురించి ట్వీట్లు చేస్తూంటారు. ఇక చిన్నా చితకా నేతలు…సోషల్ మీడియా కార్యకర్తలు చేసే కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. ఇది దేనికి సూచిక..?
ఓ ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని అనే వ్యక్తికి ఎలాంటి మనస్థత్వం ఉంటుంది..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు తిట్లు, నాపనార్థాలుగా మారిపోతున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా భావించడం… కొన్నాళ్ల క్రితం ఉండేది కాదు. రాజకీయంగా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నా… వ్యక్తిగతంగా.. హననం అయిపోవాలని ఎవరూ కోరుకునేవారు కాదు. కానీ… రాజకీయాలంటే.. అధికారం మాత్రమే… తమకు మాత్రమే దక్కాలన్న వారి రంగ ప్రవేశం తర్వాత పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యర్థులను భౌతికంగా అంతమొందించి అయినా గెలవాలనుకునే మనస్థత్వంతో విరుచుకుపడుతున్నారు. ఇతరులు ఉంటే.. తమకు… విజయం దక్కదేమో అన్న అనుమానం కలిగినప్పుడు.. ఆ అసహనాన్ని ఇలా రాజకీయ విమర్శల రూపంలో… వెల్లడిస్తున్నారు. నంద్యాలలో అలాంటి అసహనమే బయటపడింది. ముఖ్యమంత్రిని కాల్చి చంపాలంటూ.. ప్రసంగించి.. తనలోని ఫ్యాక్షనిజాన్ని బయటపెట్టుకున్నారు.
“త్వరలోనే పోతాడని” ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు..?
ఓ ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పులేదని నేరుగా ప్రతిపక్ష పార్టీ నేతే … ప్రకటించి… వివాదాస్పదం అయినప్పటికీ.. కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. అంటే.. ఆయన మనస్థత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమ నేతే అలా ఉంటే ఆయనను మెప్పించడానికి కింది స్థాయి నేతలు.. ఇక ఎలా వ్యవహరిస్తారో చెప్పాల్సిన పని లేదు. దాని పరిణామమే… కొడాలి నాని, విజయసాయిరెడ్డి ప్రకటనలు. చంద్రబాబు భౌతికంగా ఉండకూడదన్న కోరికను.. వైసీపీ నేతలు.. ఎప్పుడు వ్యక్తం చేసినా.. ఆ పార్టీ వైపు నుంచి ఎప్పుడూ ఓ ఖండన ప్రకటచన రాదు. కానీ.. ఆ పార్టీకి చెందిన మీడియా మాత్రం.. చాలా ఎక్కువగా ప్రచారం కల్పిస్తుంది. దాని వల్ల ఎవకి అహం సంతృప్తి పడుతుందో కానీ… సామాన్య ప్రజల్లో మాత్రం.. రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన.. భౌతికంగా ఉండకూడదని… కోరుకోవడం ఏమిటన్న చర్చ జరుగుతోంది.
ప్రజల్లో భయం రేకెత్తించి రాజకీయం చేయాలనుకుంటున్నారా..?
చంద్రబాబు ఉంటే… ఎన్నికల్లో తాము గెలవలేమని.. అధికారం రావాలంటే.. తమ కోరిక అదేనన్నట్లుగా.. వైసీపీ నేతలు.. పదే పదే విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో.. ప్రజలే అధికారాన్ని ఇస్తారు కానీ.. ఓ నేతను లేకుండా చేయడం ద్వారానో… అడ్డు తొగించుకుంటేనో… మరో విధంగానే… అడ్డం లేకుండా చూసుకుంటే.. ప్రజలు మరో దారి లేక తమకే అధికారం ఇస్తామనే భ్రమలో.. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం… ఏమైనా చేసే పరిస్థితికి ప్రతిపక్ష నేతలు వెళ్లిపోయారని… వీరి మాటల ద్వారా తెలుస్తోందన్న విమర్శలు టీడీపీ నేతల నుంచి వస్తున్నాయి. జగన్ మనస్థత్వంపై ఇప్పటికే.. అనేక రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఆయన సన్నిహితులంతా నేరస్తులే. ఆయన పార్టీకి చెందిన వారు ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ప్రజలను ఆందోళన గురి చేస్తోంది. ఈ విషయాన్ని వారు గుర్తిస్తారో.. భయంతోనే.. తమకు పనులు అవుతాయని… అదే పంథా కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే..!