వైసీపీ అధినేత జగన్ రెడ్డికి.. షర్మిల నుంచి ఊహించని షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల వెళ్తే మాత్రం ఎవరు వెళ్తారులే అనుకుంటున్నారు కానీ… ఊహించని విధంగా జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేల పేర్లు కూడా షర్మిలతో పాటువెళ్లే వారి మాటల్లో వినిపిస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి కోవర్టుగా వెళ్లాడో.. నిజంగా షర్మిలతో తిరుగుతున్నారో తెలియదు కానీ.. తానే కాంగ్రెస్ లో ఫస్ట్ చేసే వ్యక్తినని చెబుతున్నారు.
తాజాగా పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ సీటు రాలేదని కాంగ్రెస్ లో చేరిపోయేందుకు మల్లాది విష్ణు సిద్దమయ్యారని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. తాజాగా గడికోట శ్రీకాంత్ రెడ్డి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన జగన్ రెడ్డి స్నేహితుడు. అయితే టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని.. రాయచోటిలో ఓ ముస్లిం అధికారికి సీటిస్తామని జగన్ రెడ్డి చెబుతున్నారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తానని మీడియాకు లీక్ ఇచ్చారు. ఆయన టిక్కెట్ ఖరారు చేయించుకోవడానికి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని రాజకీయవర్గాలకు తెలుసు.
ముందు ముందు చాలా మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నామని మీడియాకు లీకులు ఇచ్చే అవకాశం ఉంది. జగన్ రెడ్డి కొంత మంది సీనియర్లకు టిక్కెట్లు ఎగ్గొట్టాలనుకుంటున్నారు. వారిపై వ్యతిరేకత ఉందని.. అందుకే తాను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డి వీరిని కాంగ్రెస్ లోకి వెళ్లనిస్తారా లేకపోతే టిక్కెట్లు ఖరారు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.