వైసీపీ నేతలకు జైలుకెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా చేస్తున్నారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకుని వారు తప్పు చేశారని ప్రజలకు కూడా క్లారిటీ వచ్చిన తర్వాతనే అరెస్టు చేసే విధంగా వ్యూహం పన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇల్లు, టీడీపీ ఆఫీసులో దాడికేసుల్లో నిందితులు అరెస్టు అయి జైలుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు.
కేసులు నమోదు చేసిన వెంటనే వైసీపీ ప్రభుత్వంలోలాగా… అర్థరాత్రి ఇళ్లపై దాడులు చేసి అరెస్టులు చేసి ఉంటే టీడీపీ కార్యకర్తల ఈగో శాటిస్ ఫై అయ్యేది. కానీ అలా చేయడం వల్ల సామాన్య ప్రజల్లో చట్టంపై నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే ప్రాసెస్ ప్రకారమే పూర్తి చేశారు. ఈ క్రమంలో వారు తప్పించుకునే అవకాశాలను ఒక్కొక్కటిగా తెగ్గొడుతూ వచ్చారు. చివరికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.
ఇప్పుడు పరిస్థితి అర్థం కావడంతో పారిపోయేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ వారు ఎందుకు పారిపోతున్నారో కానీ..ఎక్కడ ఉన్నా అరెస్టు చేసి తీసుకొస్తారు. ఒక వేళ అరెస్టు చేయకపోతే ఆజ్ఞాతంలో ఎవరికీ అందుబాటులో లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాలి. పైగా పారిపోయారనే పేరు. అయినా పలువురు పారిపోతున్నారు. వారిని పోలీసులు పట్టుకొస్తున్నారు
జగన్ రెడ్డి ఈగోను శాటిస్ ఫై చేయడానికి వీరందరూ అప్పట్లో చెలరేగిపోయారు. ఇప్పుడు కేసుల పాలై కోర్టులు, జైళ్ల వెంట తిరగబోతున్నారు. ఈ కేసులో వారి రాజకీయ జీవితానికి ముగింపు పలికినా ఆశ్చర్యం ఉండదు.