ఏపీ లిక్కర్ స్కామ్ కింగ్ పిన్‌గా అందరూ భావిస్తున్న వాసుదేవరెడ్డి రెండు నెలలుగా అడ్రస్ లేరు. ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఆయనను అరెస్టు చేయడానికి సెర్చ్ చేస్తున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా కొన్ని మీడియా వర్గాలకు వచ్చిన లీకులను బట్టి.,.. అరెస్టు అని ప్రచారం చేసేశారు. కానీ సీఐడీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ లఅంశంపై స్పందించలేదు.
ఏపీ లిక్కర్ స్కామ్ గురించి గుట్టు మొత్తం బయటపడుతుందన్న ఉద్దేశంతో ఆయనను ముందుగానే గత ప్రభుత్వ పెద్దలు ఆజ్ఞాతంలోకి పంపించారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కోసం జరుగుతున్న వేట, ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరుగుతున్న విచారణ తీరు తెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న కొంత మంది జగన్ సర్వీస్ అధికారులు… సమాచారాన్ని కావాల్సిన వాళ్లకు చేర వేస్తూ… నిందితుల్ని తప్పించుకుని తిరిగేలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్లలో అత్యధికంగా నగదు లావాదేవీలే జరిగినందున ఈడీకి కూడా సిఫారసు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి సమాచాన్ని సీఐడీ సేకరించిందని చెబుతున్నారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వైసీపీ వర్గాలు ఇటీవలి కాలంలో.. కొన్ని అరెస్టు లీకులు ఇస్తూ… తప్పు దోవ పట్టిస్తున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి అనే సోషల్ మీడియా కీచకుడి దగ్గర నుంచి చాలా మందిని ఇలా అరెస్టు చేశారని ప్రచారం చేశారు కానీ.. వారెవరూ అరెస్టు కాలేదు. మరి వాసుదెవరెడ్డి అరెస్టయ్యారా లేదా అన్నది సీఐడీ ప్రకటిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.