లక్ష్మీస్ NTR . ఈ సినిమాని అనౌన్స్ చేసిన రోజు నుంచీ కాంట్రవర్సీలు, సంచలన ప్రకటనలతో మీడియా అటెన్షన్ ని రాబట్టడం లో సక్సెస్ అయ్యాడు, రాం గోపాల్ వర్మ. అయితే ఆయన దర్శకత్వం లో రానున్న “లక్ష్మీస్ NTR” సినిమా లో ఎవరిని టార్గెట్ చేయనున్నారో వర్మ చేసిన ప్రకటన ద్వారా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
ముందు గా బాలకృష్ణ NTR బయోపిక్ ని తలపెట్టినపుడు తనకి దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందన్న విషయాన్ని NTR గురించిన ఒక వీడియో రిలీజ్ చేసాడు వర్మ. అయితే వర్మకి దర్శకత్వ ఛాన్స్ ఇవ్వకపోవడం తో నే ఆయన ఈ “కౌంటర్ బయోపిక్” మొదలెట్టారనేది బహిరంగ రహస్యమే. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. బాలకృష్ణ తీయాలనుకున్న బయోపిక్ ని కేవలం 1983 లేదా 1984 టైం లైన్ వరకు మాత్రమే, అంటే సినిమాల్లో వెలుగొందడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవడం. అంతవరకు గానీ, లేదా నాదెండ్ల వెన్నుపోటుని తట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అవడం వరకు మాత్రమే తీసి, ఎలక్షన్స్ లోపు రిలీస్ చేస్తే ఆ మైలేజ్ కాస్తో కూస్తో 2019 ఎలక్షన్స్ కి ఉపయోగపడుతుందని భావించారు.
అయితే వర్మ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాత గా వైసిపి నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. అంటే, బాలయ్య తీయనున్న సినిమా NTR పొలిటికల్ జీవితం లో మొదటి భాగం మాత్రమే చూపి, టిడిపి కి మేలు చేయాలనుకుంటే, వర్మ సినిమా లో లక్ష్మీపార్వతి ఎంటరైనప్పటినుంచి చూపి, చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ ని హైలైట్ చేయడం ద్వారా టిడిపి కి నష్టం జరిగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది అందరూ ఊహించిందే అయినా, ఎవరికైనా ఏ ఒక్క శాతమైనా ఎవరికైనా డౌట్ ఉంటే, అది కూడా క్లియర్ అయ్యేందుకన్నట్టు, వైసిపి నేతని నిర్మాతగా అనౌన్స్ చేసి ఈ సినిమా ద్వారా -“చంద్రబాబుని టార్గెట్ చేసినట్టు చెప్పకనే చెప్పాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని పైకి అంటున్నప్పటికీ వర్మ టార్గెట్ చంద్రబాబు అన్నది మాత్రం ఆల్ మోస్ట్ క్లియర్ !!