ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో స్వయంగా అధికార పార్టీ నేతలు కూడా తమ వ్యాపారాలను హైదరాబాద్కు మార్చుకునేందుకు నిర్ణయాలు తీసుకోవడం బట్టబయలు చేస్తోంది. కుటుంబాన్ని కిడ్నాప్ చేయడంతో భయపడిపోయిన ఎంవీవీ సత్యనారాయణ…. తన వ్యాపారాల్ని హైదరాబాద్ కు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. విశాఖలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇక తాను విశాఖలో ఎలాంటి వ్యాపారాలను చేయబోనని మీడియా ప్రతినిధులకు చెప్పారు. హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోతానని చెప్పారు.
ఏపీలో వ్యాపారం చేయడం చాలా కష్టంగా ఉందని… విశాఖలో అనుమతులు రావడం .. చాలా ఆలస్యమైన ప్రక్రియ అంటున్నారు. ఇటీవల ఓ సైట్ లో బ్లాస్టింగ్ కోసం అప్లయ్ చేసుకుంటే.. ఇంకా ఇవ్వలేదన్నారు. అదే హైదరాబాద్ లో అయితే ఇలాంటి అనుమతులు ఒక్క రోజులోనే వస్తాయన్నారు. మొత్తంగా వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పేదమిటంటే.. ఏపీలో వ్యాపారం చేయలేమని… హైదరాబాద్ వెళ్లిపోవడం బెటరని ఆయనంటున్నారు.
ఏపీని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని చెప్పక ముందు … ఎంవీవీ సత్యనారాయణ వ్యాపారం బాగానే చేసుకునేవారు. ఆయన వ్యాపారంపై ఎన్ని వివాదాలున్నా.. .. రాజకీయ ముద్ర లేకపోవడంతో హైలెట్ అయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆయన వైసీపీ తరపున ఎంపీ. ఆ పార్టీలోనే ఆయనపై కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా.. టీడీపీ ఎంపీ ఒకరు.. పది వేల కోట్ల పెట్టుబడుల్ని తెలంగాణకు తరలిస్తే.. స్వయంగా వైసీపీ ఎంపీ కూడా .. అదే పని చేస్తున్నారు. మరి లోపం ఎక్కడ ఉన్నట్లు ?