నారా లోకేష్ విదేశీ పర్యటనకు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లాడని… రహస్యంగా ఎందుకు వెళ్లారని వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్ చూసిన ఎవరికైనా … నారా లోకేష్ ఎక్కడికైనా వెళ్లాలంటే వైసీపీ పర్మిషన్ తీసుకుని వెళ్లాలేమో అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలోనూ ఇలాగే ఆరోపించారు. నారా లోకేష్ వ్యక్తిగత పర్యటన కోసం జర్మనీ వెళ్తే అదేదో జగన్ కోసం కుట్ర చేయడానికి వెళ్లారని ఫీలైపోయింది వైసీపీ. ఇప్పుడు కూడా లోకేష్ వ్యక్తిగత పర్యటన కోసం వెళ్లారు.
పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లిన లోకేష్ ఫ్యామిలీ
లోకేష్ మ్యారేజ్ డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి అయినంత మాత్రాన లోకేష్ కు వ్యక్తిగత జీవితం ఉండదని.. వైసీపీ అనుకుంటోంది. ఆయన బాత్ రూమ్ కి వెళ్లినా చెప్పి వెళ్లాలన్నట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంటోంది. నారా లోకేష్ ఎవరెవరికి చెప్పి వెళ్లాలో వారందరికీ చెప్పి వెళ్తున్నారు. మంత్రిగా ఉన్నందున ఆయన కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసి వెళ్తున్నారు. ఆయన ప్రభుత్వ ధనాన్ని పైసా వ్యక్తిగత పర్యటనల కోసం ఖర్చు పెట్టడం లేదు. ఇంటి దగ్గర నుంచి ఎయిర్ పోర్టుకు కూడా సొంత కారులోనే వెళ్తున్నారు. లోకేష్ ఏదో రహస్య పర్యటనలు చేస్తున్నారని తెగ ఫీలైపోతున్న వైసీపీ నేతలు… జగన్ బెంగళూరులోనే ఉంటున్నారా…. అక్కడ్నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో… ఎవరికీ చెప్పడం లేదు. రోజూ సాక్షి పత్రికలో జగన్ డైలీ షెడ్యూల్ ప్రకటిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
లోకేష్ డైలీ షెడ్యూల్‌పై నిఘా పెట్టి వివరాలు సేకరిస్తున్న వైసీపీ
నారా లోకేష్ పర్యటనల సమాచారం బయటకు ఎవరు లీక్ చేస్తున్నారన్నది కూడా టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యక్తిగత సిబ్బంది నుంచి ఈ సమాచారం లీక్ అవుతోందా లేకపోతే అతికొద్ది మందికి తెలిసిన అధికర వర్గాల నుంచి ఈ సమాచారం లీకవుతుందా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ లోకేష్ షెడ్యూల్ ను రెగ్యూలర్ గా వైసీపీ వర్గాలకు చెరవేస్తున్నారన్నది మాత్రం.. స్పష్టంగా తెలుస్తోంది. ఇందు కోసం లోకేష్ చుట్టుపక్కల ఉన్న వారితోనే నిఘా పెట్టించినట్లుగా తెలుస్తోంది.
వివాదాస్పదంగా వైసీపీ రాజకీయ శైలి
లోకేష్ కదలికలపై ఇంతగా నిఘా పెట్టాల్సిన అవసరం… వైసీపీకి ఎందుకు ?. లోకేష్ ఎక్కడికి వెళ్లినా అధికారిక పర్యటన అయితే వెంటనే మీడియాకు సమాచారం ఇస్తున్నారు. వ్యక్తిగత పర్యటన అయితే గోప్యంగా ఉంచుకుంటున్నారు. ఈ విషయాలను కూడా నిఘా పెట్టి.. ప్రకటించి వైసీపీ ఎందుకు వివాదాస్పదం చేయాలనుకుంటోందన్నది చర్చనీయాంశంగా మారింది.